‘Ahimsa’ collections: ‘అహింస’ ఫస్ట్ డే కలెక్షన్స్ మరీ ఇంత దారుణమా!?
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్లలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఒకటి. రామానాయుడు ఉన్నంత కాలం ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వరుస సినిమాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ పరిస్థితి.. సినిమాలు నిర్మిస్తోందా? లేదా? అనేలా ఉంది. ఇక ఇప్పుడు అహింస కలెక్షన్స్ చూస్తే.. ఈ దెబ్బకు సురేష్ బాబు సినిమాలు తీయడం పూర్తిగా మానేస్తాడా? అనే డౌట్స్ వస్తున్నాయి.
దగ్గుబాటి ఫ్యామిలీ(Daggubati Family)లో వెంకటేష్ తర్వాత రానా(Rana) హీరోగా రానిస్తున్నాడు. బాహుబలి వంటి సినిమాతో రానాకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. అయినా రానా అరకొరగానే సినిమాలు చేస్తున్నాడు. సొంత బ్యానర్లో కూడా సినిమాలు చేయలేకపోతున్నాడు. ఇక ఇప్పుడు రానా తమ్ముడు అభిరాం హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన ఫస్ట్ ఫిల్మ్ ‘అహింస’. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు.
ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయిపోయిన ఈ సినిమా.. ఎట్టకేలకు జూన్2న థియేటర్లోకి వచ్చింది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ ఈ సినిమాను నిర్మించాడు. గీతిక హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను కాస్త గట్టిగానే ప్రమోట్ చేశారు మేకర్స్. అభిరాం హీరోగా ఎలా ఆకట్టుకుంటాడు అనే ఆసక్తి అందరిలోను ఉంది. అయితే అహింస ఆడియెన్స్‌ను హింస పెట్టేలా ఉందనే.. రివ్యూలు వచ్చాయి. తేజ గత చిత్రాలు చిత్రం, జయం, నువ్వు నేను గుర్తు చేసేలా అహింస ఉందంటున్నారు. దీంతో ఈ సినిమాకు దారుణమైన కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కనీసం 50 లక్షల రూపాయిల గ్రాస్ కూడా రాబట్టలేకపోయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. షేర్ వాల్యూ ప్రకారం 20 లక్షల రూపాయిలు కూడా రాదని అంటున్నారు. ఈ సినిమా కోసం నాలుగు కోట్ల వరకు ఖర్చు చేశారు మేకర్స్. దాంతో అన్నీ ఏరియాల్లోను సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఈ సినిమాను విడుదల చేశాడు సురేష్ బాబు. కానీ ఈ కలెక్షన్స్ ఈ బడా నిర్మాతకు షాక్ ఇచ్చేలా ఉందంటున్నారు. ఇంకా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా అమ్ముడుపోలేదు. దీంతో ఇక పై సురేష్ బాబు సినిమాలు, డిస్ట్రిబ్యూషన్ చేస్తాడా? అనే డౌట్స్ వస్తున్నాయి. మరి అహింస ఎంత వరకు నష్టాలను తెచ్చిపెడుతుందో చూడాలి.