AP: మద్యం కుంభకోణం కేసులో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డిని సిట్ అధికారులు రెండో రోజు విచారించనున్నారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణ ఇవాళ, రేపు కొనసాగనుంది. గుంటూరు జైలు నుంచి తరలించిన సిట్ అధికారులు, ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డితో అవినాష్‌కు ఉన్న ఆర్థిక లావాదేవీలు, షెల్ కంపెనీల ద్వారా జరిగిన అక్రమ నగదు మళ్లింపుపై ప్రశ్నిస్తున్నారు.