వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. ఈ సినిమా విడుదల తేదీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. మే 22న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మృణాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక లెజెండరీ డైరెక్టర్ డేవిడ్ ధావన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.