నటి కంగనా రనౌత్ దీపికా పదుకొణెకు మద్దతుగా నిలిచింది. 8 గంటల వర్కింగ్ అవర్స్‌పై దీపికకు అండగా ఉంటానని తెలిపింది. 8 గంటలు మాత్రమే పనిచేస్తానని దీపిక చెప్పడం సబబేనని పేర్కొంది. ఎంతో కష్టపడి ఆమె ఈ స్థాయికి వచ్చిందని ప్రశంసించింది. నటించే విషయంలో తనకంటూ నిర్ణయం తీసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. పైగా ఇప్పుడామె ఓ బిడ్డకు తల్లి కూడా అని గుర్తు చేసింది.