నటి తమన్నా భాటియాకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. పవర్ సోప్స్ లిమిటెడ్ సంస్థ తన ఫొటోలను అనుమతి లేకుండా వాడుకుందని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రూ.కోటి నష్టపరిహారం కోరుతూ.. ఆమె వేసిన అప్పీల్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఒప్పందం ముగిశాక కూడా ఫొటోలు వాడారనేందుకు తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో కోర్టు ఈ కేసును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది.