బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్ నటిస్తున్న ‘దృశ్యం 3’ మూవీ షూటింగ్ పూర్తయినట్లు దర్శకుడు అభిషేక్ పాఠక్ తాజాగా ప్రకటించాడు. గత కొన్ని నెలలుగా చిత్ర బృందం ఎంతో కష్టపడి ఈ కథకు ప్రాణం పోసిందని తెలిపాడు. అయితే, హిందీ ప్రేక్షకులకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ.. ఒరిజినల్ మలయాళ వెర్షన్తో పోలిస్తే, ఈ హిందీ చిత్రం ముగింపులో కొన్ని కీలక మార్పులు చేసినట్లు వెల్లడించాడు.