తమిళనాడులో సనాతన ధర్మంపై వివాదం మళ్లీ రాజుకుంది. అసెంబ్లీలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతనాన్ని నిర్మూలించాలనే వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా, నటుడు అర్జున్ సర్జా దానిపై స్పందించాడు. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవన విధానమని స్పష్టం చేశాడు. ఇది దొంగతనం చేయకపోవడం, అసూయపడకుండా ఉండటం, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పిల్లల్లా చూసుకోవడం వంటి మంచి విలువలను నేర్పుతుందన్నారు.