Dog received diploma degree : డిప్లొమా డిగ్రీ అందుకున్న కుక్క..వీడియో వైరల్
ఓ యువతి యూనివర్సిటీ క్లాసులకు అటెండ్ అయ్యే సమయంలో ఆమె వెంట తన పెంపుడు కుక్క(Dog) జస్టిన్ కూడా హాజరయ్యేది. తన యజమాని పట్ల అంకిత భావంతో ఆ శునకం పనిచేయడంతో యూనివర్సిటీ వారు ఆ కుక్కకు కూడా డిప్లొమా డిగ్రీ పట్టాను అందజేశారు.
పెంపుడు జంతువులు(Animals) మనుషుల జీవితాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఎప్పటి నుంచో జంతువులకు, మనుషులకు మధ్య సాయం చేసుకునే అనుబంధం ఉంది. కొన్ని జంతువులు మనుషులు ఏది చెబితే అది చేస్తుంటాయి. ఇంకొన్ని మనుషుల ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడవు. ఈ మధ్యకాలంలో ఇటువంటి జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్(Videos Viral) అవుతున్నాయి.
డిప్లొమా డిగ్రీ అందుకున్న కుక్క.. వీడియో:
Seton Hall President Joseph E. Nyre, Ph.D. presents Justin, the service dog for Grace Mariani, of Mahwah, NJ, with a diploma for attending all of Grace’s classes at Seton Hall. pic.twitter.com/sZgHD5Fs3X
తాజాగా ఓ శునకం(Dog) తన యజమానితో పాటు డిప్లొమా డిగ్రీ అందుకోవడం(Dog received diploma degree) అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కుక్క పాఠాలు ఎలా చదువుతుందని అందరికీ సందేహం కలగవచ్చు. దానికి డిగ్రీ పట్టా ఇవ్వడం ఏంటనే ప్రశ్న తలెత్తవచ్చు. అయితే యూఎస్‌లోని న్యూజెర్సీ సెటన్ హాల్ యూనివర్సిటీ(University)లో గ్రాడ్యుయేషన్ డే జరుగుతోంది. ఆ కార్యక్రమంలో జస్టిన్ అనే శునకం డిప్లొమా డిగ్రీ పొందింది.
ఆ యూనివర్సిటీ(University)లో మరియాని అనే అమ్మాయి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో డిప్లొమా చదువుతోంది. ఆమె యూనివర్సిటీ క్లాసులకు అటెండ్ అయ్యే సమయంలో ఆమె వెంట తన పెంపుడు కుక్క(Dog) జస్టిన్ కూడా హాజరయ్యేది. తన యజమాని పట్ల అంకిత భావంతో ఆ శునకం పనిచేయడంతో యూనివర్సిటీ వారు ఆ కుక్కకు కూడా డిప్లొమా డిగ్రీ పట్టా(Dog received diploma degree)ను అందజేశారు. ప్రస్తుతం ఆ కుక్క డిప్లొమా పట్టా అందుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.