AP: స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలోనే అనుమతించనున్నట్లు TTD స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సోమవారం నుంచి నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు పేర్కొంది. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడొద్దని, తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది.