VKB: మర్పల్లి మండలం సిరిపురంలో కుక్కల దాడిలో రాష్ట్ర జంతువు దుప్పి మృత్యువాత పడింది. శుక్రవారం ఉదయం గ్రామంలోకి వచ్చిన దుప్పిపై వీధి కుక్కలు గుంపుగా దాడి చేశాయి. కుక్కల దాడిలో మెడ, వెనుక భాగంలో తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో దుప్పి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.