పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రావాల్సిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా ‘భవదీయుడు భగత్ సింగ్’ అని అనౌన్స్ చేసిన ఈ సినిమా కాస్త.. టైటిల్ ఎందుకు మరిందనే విషయం పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అంతుబట్టడం లేదు. గబ్బర్ సింగ్ లాంటి హిట్ కాంబోలో అనౌన్స్ అయిన ‘భవదీయుడు భగత్ సింగ్’ చూసి సంబరపడ్డారు అభిమానులు. కానీ టైటిల్ మారడంతో.. ఎక్కడో తేడా కొడుతున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు. ఎందుకంటే.. ఇది ‘తేరీ’ రీమేక్ అనే వార్తలు ఇండస్ట్రీలో జోరుగా షికార్లు చేస్తున్నాయి. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్ట్రెయిట్ మూవీ అనే తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకునేలా హరీష్ శంకర్ పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసాడని, తప్పకుండా ఉస్తాద్ భగత్ సింగ్ అంచనాలకు మించి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఇది ‘భవదియుడు భగత్ సింగ్’ అప్టేటెడ్ వెర్షన్ అని అంటున్నారు. ఇకపోతే.. ఇటీవలె లాంచనంగా మొదలైన ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను.. త్వరలోనే స్టార్ట్ చేసేందుకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్నట్టు చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఓ ఫోటోని షేర్ చేశాడు. ఇందులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి సీరియస్ డిస్కషన్లో ఉన్నాడు హరీష్. దాంతో ఇంతకు ముందులా కాకుండా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరుగులు పెట్టడం ఖాయమంటున్నారు. ఈ క్రమంలో హరీష్ శంకర్ మరో హీరోతో సినిమా చేయబోతున్నాడనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టేనని చెప్పొచ్చు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందో చూడాలి.