బీహార్ వైశాలీ జిల్లాలోని సర్సాయ్ గ్రామం గబ్బిలాల సంరక్షణకు పేరుగాంచింది. ఇక్కడి చెట్లపై లక్షల గబ్బిలాలు నివసిస్తాయి. వీటిని గ్రామ సంరక్షకులుగా కొలిచే స్థానికులు నీళ్లు పెట్టడమే కాక, వాటికి ఎవరైనా హాని చేస్తే జరిమానాలు విధిస్తూ ఉంటారు. గ్రామస్థులు జబ్బు పడినా త్వరగా నయం కావాలని వీటినే ప్రార్థిస్తారు. విశ్వాసం, పర్యావరణ రక్షణ కలగలిసిన సంప్రదాయంగా పాటిస్తున్నారు.