• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు

NLG: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ఇంధన కొరత ఏర్పడింది. నార్కట్‌పల్లిలోని పెట్రోల్ బంక్‌లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయిందని బంక్ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ఇంధనం దొరక్క వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ లేక భారీ వాహనాల యజమానులు కిరాయిలు సైతం రద్దు చేసుకుంటున్నారు.

March 24, 2026 / 06:42 AM IST

వనపర్తిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్

WNP: జిల్లాలోని ఘనపూర్ ఫోర్ట్, శ్రీ రంగనాయక స్వామి ఆలయం, సరళాసాగర్ వంటి చారిత్రక, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు డీపీఆర్ సిద్ధం చేస్తే ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయిస్తామని, జిల్లాను పర్యాటక హబ్‌గా మారుస్తామని ఆయన పేర్కొన్నారు.

March 24, 2026 / 06:41 AM IST

విగ్రహావిష్కరణకు మాజీ ఎంపీకి ఆహ్వానం

SRD: నాగల్ గిద్ద మండలం కరస్ గుత్తి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్‌కు నిర్వాహకులు ఆహ్వానించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఆయనను కలిసి ఈనెల 25న శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పకుండా వస్తానని మాజీ ఎంపీ చెప్పారని నిర్వాహకులు లక్ష్మణ్ తెలిపారు.

March 24, 2026 / 06:41 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష

KMR: జిల్లా మద్నూర్ మండలానికి చెందిన ఇద్దరికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్షతో పాటు జరిమానాను సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ చంద్రకళ విధించినట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. చిన్న శక్కర్గ గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ (41), రుసేగావ్ గ్రామానికి చెందిన క్యాతంవార్ వెంకట్ (42)కు ఒకొక్కరికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారన్నారు.

March 24, 2026 / 06:40 AM IST

నేడు మధిరలో పవర్ కట్

KMM: మధిర పట్టణంలోని టౌన్-2 బస్ డిపో ఫీడర్ పరిధిలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ అనిల్ కుమార్ తెలిపారు. లైన్ మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బస్ డిపో ఏరియా, శ్రీనగర్ కాలనీ, అగ్రికల్చరల్ ఫారం రోడ్డు, సుందరయ్య నగర్, హనుమాన్ కాలనీ ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

March 24, 2026 / 06:38 AM IST

రూ. 10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు

KNR: శంకరపట్నం మండలం కన్నాపూర్‌లో సీసీ రోడ్లు నిర్మాణానికి ఎన్ఆర్ఆజీఎస్ నిధులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గ్రామానికి రూ. 10 లక్షలు మంజూరు చేశారు. సర్పంచ్ రమా, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అశోక్, పీఎస్ రాజేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.

March 24, 2026 / 06:35 AM IST

ఏప్రిల్ 8 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు

SDPT: సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి ఏప్రిల్ 8 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి బలవంతంగా సంస్థలు మూసివేయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ కార్యక్రమానికైనా ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు.

March 24, 2026 / 06:34 AM IST

‘నంది మేడారం CHC ప్రారంభానికి చర్యలు’

PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఏప్రిల్ 6 నుంచి 11 వరకు వైద్య శాఖ పరిధిలో చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా రామగుండం క్రిటికల్ కేర్ సెంటర్, నంది మేడారం CHC ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

March 24, 2026 / 06:33 AM IST

‘అర్హులైన దివ్యాంగులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలి’

ADB: తలమడుగు మండలంలోని అర్హులైన దివ్యాంగులందరికీ అంత్యోదయ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ప్రతి ప్రభుత్వ శాఖలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని కోరారు. ఎంఆర్వో, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు స్థానిక పాఠశాలల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.

March 24, 2026 / 06:32 AM IST

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ధ్వజస్తంభం

BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో వేగవంతమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 25న జరగనున్న ద్వజారోహణం కోసం ధ్వజస్తంభానికి ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. విద్యుత్తు దీపాలు, పుష్ప మాలికలతో మెరిసిపోతున్న ధ్వజస్తంభం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

March 24, 2026 / 06:32 AM IST

మేడ్చల్‌లో వరి పంట వైపే మొగ్గు చూపిన రైతన్నలు

MDCL: జిల్లాలో యాసంగి సీజన్‌లో కూడా రైతన్నలు వరి పంట వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. వర్షాకాలంతో పోల్చితే ఈసారి వరి సాగు విస్తీర్ణం సుమారు 8 శాతం మేర పెరిగినట్లు TCM తెలిపారు. నీటి లభ్యత, మార్కెట్‌లో స్థిరమైన ధరల ఆశతో రైతులు వరి సాగును ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నారు. అయితే, అధిక వరి సాగుతో నీటి వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

March 24, 2026 / 06:31 AM IST

మాధారంలో అక్రమ కంచె.. 21 మందిపై కేసు

NGKL: ఊర్కొండ మండలం మాధారం గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో దౌర్జన్యంగా ప్రవేశించి, అనుమతి లేకుండా కంచె (కడ్డీలు) వేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు రవిశంకర్ ఫిర్యాదు మేరకు సుమారు 21 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు ఎస్సై కృష్ణదేవ సోమవారం తెలిపారు.

March 24, 2026 / 06:31 AM IST

క్షయ వ్యాధిపై ఉమ్మడి జిల్లాలా పోరాటం..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్షయ నిర్మూలన లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 4,200 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. నిక్షయ్ మిత్ర పథకం ద్వారా దాతలు బాధితులను దత్తత తీసుకుని పౌష్టికాహార కిట్లను అందిస్తున్నారు. ప్రభుత్వం నిక్షయ్ పోషణ్ యోజన కింద నెలకు రూ.500 ఆర్థిక సాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది.

March 24, 2026 / 06:30 AM IST

రోడ్డుపై వడ్లు.. ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

SRPT: చిలుకూరు మండల కేంద్రం నుంచి బేతవోలు వెళ్లే మార్గంలో లక్ష్మీనరసింహ స్వామి గుట్ట సమీపంలో ప్రధాన రహదారిపై రైతులు ధాన్యం ఆరబోయడంతో సోమవారం రాత్రి ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వరి కోతల నేపథ్యంలో రైతులు రోడ్లపై కాకుండా ఇతర ప్రదేశాల్లో ధాన్యం ఆరబోయాలని వాహనదారులు విన్నవిస్తున్నారు.

March 24, 2026 / 06:29 AM IST

తొర్రూరు మున్సిపాలిటీలో భార్యకు బదులు భర్త పెత్తనం

MHBD: తొర్రూరు మున్సిపాలిటీలో సోమవారం అంగడి వేలం పాట నిర్వహించారు. ఈ క్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ సోమ రజిని స్థానంలో ఆమె భర్త సోమ రాజశేఖర్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎవరనేది తెలియని పరిస్థితిలో మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు ఉన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో మరి.

March 24, 2026 / 06:27 AM IST