WGL: వరంగల్ నగరంలో గవిచర్ల క్రాస్ జంక్షన్‌లో నేడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల 95వ సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేత రాచర్ల బాలరాజు మాట్లాడుతూ.. సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అమెరికా ఆధిపత్య విధానాలను విమర్శిస్తూ, మోడీ ప్రభుత్వం వాటికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
SRD: ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత 46 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.24,38,870 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్, ఈవో శివరుద్రప్ప పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.
RR: కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీలను అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నందిగామ మండల బీజేపీ అధ్యక్షుడు అరవింద్ చారిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు.
NGKL: మంత్రి జూపల్లి కృష్ణారావు వైఖరిని నిరసిస్తూ కొల్లాపూర్లోని ఎంపీడీవో కార్యాలయం ముందు సర్పంచులు ధర్నా నిర్వహించారు. తమకు కనీస గౌరవం ఇవ్వకుండా అధికారులు, మంత్రి వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. గ్రామాల్లోకి మంత్రి రావాలంటే సర్పంచుల అనుమతి ఉండాలని డిమాండ్ చేశారు. తమపై చూపుతున్న వివక్షను వీడకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు.
NZB: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల 95వ వర్ధంతిని ధర్పల్లిలో ఘనంగా నిర్వహించారు. సోమవారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశం కోసం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లు చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్నారు. వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
MDK: రామాయంపేట మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్‌గా గణేష్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన కమిషనర్ శ్రావణ్ సెలవుపై వెళ్లగా, తూప్రాన్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న గణేష్ రెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రజలకు అందుబాటులో ఉండి సరైన సేవలు అందిస్తామని గణేష్ రెడ్డి తెలిపారు.
MBNR: నగరంలోని శిల్పారామంలో “మినీ సరస్ మేళా”ను ఇవాళ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రారంభించారు. నాబార్డ్, గ్రామాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఈ మేళాను ఏర్పాటు చేశారు. ఈ నెల 29 వరకు జరిగే ఈ ప్రదర్శనలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
GDWL: కాలూరు తిమ్మందొడ్డి మండలంలోని జూరాల కుడి కాలువలో కొంత మంది రైతులు రాళ్లతో అడ్డంకులు సృష్టించారు. యాసంగి పంటలకు అత్యవసరమైన సమయంలో డిస్ట్రిబ్యూటరీ నంబర్ 12 వద్ద నీటి ప్రవాహం నిలిచిపోతుంది. దీంతో అనంతపురం, బస్రాచెర్వు గ్రామాలకు సాగునీరు అందకపోవడంతో రైతులు అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నారు.
NRML: విద్యార్థుల్లో నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో పలు పాఠశాలల్లో రాతపరీక్షలు నిర్వహించారు. జిల్లా పోస్టల్ అధికారి గుంపు స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జరిగిన ఈ పరీక్షలకు సుమారు 52 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తపాలా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
WNP: గ్రంథాలయాలు దేశ భవిష్యత్తును మార్చే జ్ఞాన ఆలయాలని సమ్మిళిత విద్య సమన్వయకర్త (CMO) ప్రతాపరెడ్డి అన్నారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వల్లభ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. చదవడం ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు.
MNCL: పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఉపాధ్యక్షులు రఘునాథ్ వెల్లడించారు. లక్షెట్టిపేట పట్టణంలో వివిధ మండలాల బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఇస్తున్న శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయడం లేదన్నారు. బీజేపీ నాయకులు ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
NRPT: మక్తల్ మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని సోమవారం మున్సిపల్ కమిషనర్ శ్రీరాములను మర్యాదపూర్వకంగా కలిశారు. వార్డులో జరగాల్సిన అభివృద్ధి పనులు, వాటికి కావాల్సిన నిధులపై చర్చించారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో ఇప్పటికే అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, మరిన్ని పనుల మంజూరు కోసమే కమిషనరు కలిసినట్లు ఆమె తెలిపారు.
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ బీఆర్ఎస్ నాయకుల పనితీరును విమర్శించారు. మండల పార్టీ అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని బధనం చేయడం రెండు పార్టీలకు తగదని హితవు పలికారు. మెట్టుగుట్ట ఛైర్మన్ పైడిపాల రఘు చందర్ పాల్గొన్నారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈ నెల 27,28న నిర్వహించనున్న మహా పట్టాభిషేకం కార్యక్రమాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ పాల్గొన్నారు.
KMR: ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ‘నీటి ప్రతిజ్ఞ’ చేయించారు. నీటిని పొదుపుగా వాడుతామని, భవిష్యత్తు తరాలకు జల వనరులను భద్రంగా అందిస్తామని ఈ సందర్భంగా అధికారులు ప్రమాణం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నీరు అత్యంత విలువైన ప్రకృతి వనరు అని అన్నారు