• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ఉత్తమ సేవలకు దక్కిన పురస్కారాలు’

PDPL: పెద్దపల్లి TB యూనిట్ సీనియర్ పర్యవేక్షకులు దేవ తిరుపతి, ల్యాబ్ టెక్నీషియన్ సజావుద్దీన్ ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. ఇవాళ పెద్దపల్లిలో జరిగిన సమావేశంలో DMHO డా. ప్రమోద్ కుమార్, జిల్లా TB ప్రోగ్రాం అధికారి సుధాకర్ రెడ్డి వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. వ్యాధి నిర్మూలనలో వారి సేవలను ప్రశంసించారు.

March 24, 2026 / 07:17 PM IST

సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన విప్, ఎమ్మెల్యేలు

KNR: రైతు భరోసా నిధులను విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. తొలి విడతగా ఎకరం వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.3,600 కోట్లు జమ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు.

March 24, 2026 / 07:15 PM IST

ఖైదీలను సాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశం

WNP: ఆర్థిక స్థోమత లేని కారణంగా హామీ పత్రం, డబ్బులు చెల్లించలేని విచారణ ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశం అని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం జిల్లాస్థాయి సాధికార కమిటీ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎవరికైతే హామీ పత్రం డబ్బులు మాఫీ చేసి జైలు నుంచి విడుదలకు అనుమతించడం జరుగుతుందో వారిపై తక్షణ చర్యలు ఉంటాయి.

March 24, 2026 / 07:14 PM IST

నేత్రపర్వంగా నరసింహుని కళ్యాణం

BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి నిత్య కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఆలయ మహామండపంలో స్వామి, అమ్మవార్లను నూతన వస్త్రాలు, పుష్పాలతో అలంకరించి, వేద మంత్రాల మధ్య వేడుక నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ క్రతువులో భక్తులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

March 24, 2026 / 07:14 PM IST

వరంగల్‌లో కల్తీకారం పట్టివేత..!

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలోని ఓ ఇండస్ట్రీ పై మంగళవారం సాయంత్రం ఆహార నియంత్రణ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో మిర్చి తొడిమలతో కల్తీ చేసి కారం తయారు చేస్తున్నట్లు గుర్తించి, 70 కిలోల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

March 24, 2026 / 07:09 PM IST

అడెల్లి మహా పోచమ్మ హుండీ ఆదాయం రూ. 53 లక్షలు

NRML: సారంగాపూర్ మండలం అడెల్లి శ్రీ మహా పోచమ్మ దేవాలయంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. మొత్తం 15 హుండీల ద్వారా రూ. 53,97,520 నగదు ఆదాయం లభించింది. అదనంగా 125.490 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి సమకూరింది. ఈ మొత్తాన్ని అమ్మవారి ఖాతాలో జమ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

March 24, 2026 / 07:08 PM IST

బద్దెనపల్లిలో ప్రపంచ నీటి దినోత్సవం

SRCL: ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని తంగల్లపల్లి మండలంలోని బద్దెనపల్లి గ్రామంలో ఉన్న రైతు వేదికలో భూగర్భ జలాల సంరక్షణపై అవగాహన కల్పించారు. బస్టాండ్ నుండి రైతు వేదిక వరకు ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం భూగర్భ జల అధికారి ఆధ్వర్యంలో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. భూగర్భ జలాల ప్రాధాన్యత, వాటి సంరక్షణకు తీసుకోవాలన్నారు.

March 24, 2026 / 07:07 PM IST

తాండూరు గ్రామ పంచాయతీలో పర్యటించిన అదనపు కలెక్టర్

MNCL: ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా తాండూరు గ్రామ పంచాయతీలో అదనపు కలెక్టర్ చంద్రయ్య మంగళవారం పర్యటించారు. నర్సరీని సందర్శించి, శానిటేషన్ పనులను, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. గ్రామంలోని ప్రతి సైడ్ డ్రెయిన్ శుభ్రంగా ఉండాలని, సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. OHSR ట్యాంకులను ప్రతి 10రోజులకు ఒకసారి శుభ్రపచాలని సూచించారు.

March 24, 2026 / 07:07 PM IST

అన్యాయంపై ప్రశ్నించిన ఎంపీ కడియం కావ్య

HNK: గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో వరంగల్‌కు జరుగుతున్న అన్యాయం పట్ల పార్లమెంట్లో ఎంపీ కడియం కావ్య ప్రశ్నించారు. 2025లో తీసుకొచ్చిన “వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ)” చట్టం కింద 125 రోజుల ఉపాధి హామీ అమలు ఇంకా ప్రారంభం కాలేదని, వెంటనే ఈ హామీని అమలు చేయాలని, తెలంగాణలో పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలన్నారు.

March 24, 2026 / 07:05 PM IST

ఆసిఫాబాద్‌లో వార సంతకు వేలం

ASF: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ చునర్కర్ సతీష్ ఆధ్వర్యంలో వారసంతకు వేలం నిర్వహించారు. వేలం పాటలో ఇద్దరు పాల్గొనగా రూ.9.51 లక్షలకు శంకర్ దక్కించుకున్నాడు. గాతేడాది రూ.8.49 లక్షలు పల్కగా ఈసారి రూ.1 లక్ష 2 వేలు అధికంగా గ్రామ పంచాయతీకి ఆదాయం పెరిగింది. ఈ కార్యక్రమంలో వాంకిడి ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

March 24, 2026 / 07:05 PM IST

‘శానిటేషన్ లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు’

JGL: జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలోని శానిటేషన్ వాహనాల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని మున్సిపల్ ఛైర్‌పర్సన్ వాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కొత్త బస్టాండ్ వాటర్ ట్యాంక్ వద్ద వాహనాలను ఆమె స్వయంగా పరిశీలించారు. సకాలంలో ఆయిల్ చేంజ్ చేస్తూ ఫిట్నెస్‌ను కాపాడాలని, మరమ్మతుల్లో ఉన్న వాహనాలను వెంటనే అందుబాటులోకి తేవాలని సూచించారు.

March 24, 2026 / 07:04 PM IST

సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: కలెక్టర్

MDK: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ, ఇంట్రా గ్రిడ్, గ్రిడ్, ఇరిగేషన్, ఫారెస్ట్, ఆర్డబ్ల్యూఎస్ గ్రామపంచాయతీ, గ్రౌండ్ వాటర్, మున్సిపల్ కమిషనర్స్, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.

March 24, 2026 / 07:02 PM IST

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి: BSP

SDPT: హుస్నాబాద్ పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలను మున్సిపాలిటీలో జరగబోయే పాలకవర్గ సమావేశంలో అత్యవసరంగా చర్చించి పరిష్కరించాలని హుస్నాబాద్ బీఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జ్ పచ్ఛిమట్ల రవీందర్ గౌడ్ కోరారు. పట్టణంలో కోతుల సమస్య రోజు రోజుకు తీవ్రమవుతూ ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారని అన్నారు. కోతుల దాడిలో పలువురు గాయపడ్డా ప్రభుత్వ నుంచి ఎలాంటి చలనం లేదన్నారు.

March 24, 2026 / 07:01 PM IST

గంజాయి మొక్కల సాగు.. నిందితుడి అరెస్ట్

ADB: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమురం భీమ్ కాలనీలో ఇంటి వద్ద గంజాయి సాగు చేస్తున్న గేడం జంగు (39) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై మధుకృష్ణ బృందం దాడి చేసి, సుమారు రూ.5,000 విలువైన 2 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

March 24, 2026 / 07:01 PM IST

గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ నూతన కమిటీ ఎన్నిక

MBNR: గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా శ్రీవల్లి, ఉపాధ్యక్షులుగా పాలకొండ వెంకటేష్ గౌడ్, అక్షయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రవీందర్‌ను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ హాజరై నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఘనంగా సత్కరించారు.

March 24, 2026 / 07:01 PM IST