• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నిఘా నీడలో కొండపోచమ్మ

SDPT: జగదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపోచమ్మ గ్రామంలో ఐదు నూతన సీసీ కెమెరాలను గజ్వేల్ రూరల్ సీఐ డీ. రవి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాల నియంత్రణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో SI జె.కృష్ణా రెడ్డి, సర్పంచ్ సంధ్యా శ్రీనివాస్ పాల్గొన్నారు.

March 26, 2026 / 02:15 PM IST

టెంట్ హౌస్ తొలగించి.. షెడ్డు నిర్మాణం

MBNR: జిల్లా కేంద్రంలోని రూ.ఐదు భోజనం కేంద్రంలో పరిస్థితులపై హిట్ టీవి యాప్ వరుస కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి మాజీ మంత్రి శ్రీనివాస్ కూడా స్పందించారు. తాజాగా దీనిని స్థానికులు పట్టణ మేయర్, డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యపై వారు సానుకూలంగా స్పందించి వెంటనే షెడ్‌ని నిర్మించారు. ఇక నుంచి ప్రజలకు అందులో మధ్యాహ్న భోజనం అందజేయనున్నారు.

March 26, 2026 / 02:13 PM IST

ఆలేరు మున్సిపాలిటీ కేంద్రంలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’

BHNG: ప్రభుత్వం చేపట్టిన 99-Days Action Plan ‘ప్రజాప్రాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈరోజు ఆలేరు గవర్నమెంట్ హాస్పిటల్ లో(సూపరింటెండెంట్ స్వప్న రాథోడ్, డాక్టర్లు సిబ్బంది మరియు ప్రజలకు)ఫైర్ సేఫ్టీ మీద స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్దుల్ హమీద్ అవగాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి అవగాహన కల్పించారు.

March 26, 2026 / 02:09 PM IST

ఈనెల 31న జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు

PDPL: జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు ఈ నెల 31న పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి సురేష్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఉదయం 10 గంటలకు ఒరిజినల్, జిరాక్స్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

March 26, 2026 / 02:09 PM IST

గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటి విడుదల

KNR: ఎండాకాలం దృష్ట్యా రైతుల పంటలు ఎండిపోకుండా నీటిని అందించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హైదరాబాద్‌లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంగళవారం కోరారు. దీంతో రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నీటిని అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 26, 2026 / 02:08 PM IST

వేతనాల కోసం మిషన్ భగీరథ సిబ్బంది నిరసన

NZB: బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో విభాగంలో పనిచేస్తున్న లైన్‌మెన్లు, సిబ్బంది తమకు రావాల్సిన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు పంప్​హౌస్​ ఎదుట నినాదాలు చేశారు.

March 26, 2026 / 02:08 PM IST

నిర్మల్‌లో 3 రోజులు నీటి సరఫరా నిలిపివేత

NRML: నిర్మల్ పట్టణానికి నీటి సరఫరా చేసే మిషన్ భగీరథ మాడెగాం శుద్ధీకరణ కేంద్రంలో నిర్వహణ, మరమ్మతు పనులు జరుగనున్నందున మార్చి 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు పురపాలక సంఘం అధికారులు తెలిపారు. ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని గురువారం సూచించారు.

March 26, 2026 / 02:06 PM IST

‘ప్రజా ప్రభుత్వంలో సొంతింటి కల సాకారం’

RR: మహేశ్వరం నియోజకవర్గం, కందుకూరు మండలం కొత్తూరు, గఫూర్ నగర్, ముచ్చర్ల గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేదవారి సొంతింటి కల సాకారం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, పాల్గొన్నారు.

March 26, 2026 / 02:06 PM IST

‘పశువులకు టీకా వేయించండి’

WNP: పశువులకు తప్పనిసరిగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని రాష్ట్ర మానిటరింగ్ అధికారిణి డాక్టర్ రజని అన్నారు. గురువారం గోపాలపేట మండలంలోని చాకలపల్లిలో పశువైద్య సిబ్బంది నిర్వహిస్తున్న టీకా కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేశారు. 140 పశువులకు టీకా వేశామని జిల్లా పశువైద్యాధికారి వెంకట్ రెడ్డి చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 26, 2026 / 02:05 PM IST

జూనియర్ కళాశాల నిర్మాణానికి భూమి పూజ

NLG: కనగల్‌లో 6 కోట్లతో నిర్మించనున్న జూ.కళాశాల భవన నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

March 26, 2026 / 02:03 PM IST

సొంత ఖర్చులతో వాటర్ ప్యూరిఫయర్ ఏర్పాటు చేసిన కౌన్సిలర్

MNCL: బెల్లంపల్లి పట్టణం 13వ వార్డు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కౌన్సిలర్ రాజకుమార్ అండగా నిలిచారు. తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి, తన సొంత ఖర్చులతో నూతన వాటర్ ప్యూరిఫయర్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీరు అందించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కౌన్సిలర్ ఉదారత పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

March 26, 2026 / 02:01 PM IST

పెట్రోల్ బంకుల యజమానులకు ఎస్సై హెచ్చరికలు

VKB: పెట్రోల్ బంకుల యజమానులకు ధారూర్ ఎస్సై రాఘవేందర్ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ధారూర్ లోని పెట్రోల్ బంకులకు వచ్చే వారికి వాహనాల్లో మాత్రమే పెట్రోల్ పోయాలని, వాటర్ బాటిల్స్ ఇతర డబ్బాలలో పోయకూడదని సూచించారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ విషయంలో ప్రజలను భయపెట్టే విధంగా అపోహాలు కల్పించవద్దని సూచించారు.

March 26, 2026 / 02:00 PM IST

మేడ్చల్ ప్రాంతాల్లో భూగర్భం తోడిస్తున్నారు..?

MDCL: మేడ్చల్ పరిసర ప్రాంతాలలో వేసవి వేళ ఓవైపు భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతుంటే, కొంతమంది ఎలాంటి పర్మిషన్లు లేకుండా బోర్లు వేస్తూ భూగర్భ జలాలను తోడేస్తున్నారని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని భూగర్భ జల శాఖ అధికారులు తగిన విధంగా పరిశీలించి, చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

March 26, 2026 / 02:00 PM IST

రేపు నల్లబెల్లిలో సీతారాముల కల్యాణ వేడుకలు

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రామాలయంలో రేపు శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు ఇవాళ తెలిపారు. ఉదయం 6 గంటలకు స్వామివారి విగ్రహాలకు అభిషేకాలు, ఉదయం11 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

March 26, 2026 / 01:49 PM IST

ఆరోగ్యశ్రీ బిల్లుల విడుదలలో జాప్యం జరుగుతోంది: హరీశ్ రావు

HYD: ఆరోగ్యశ్రీ బిల్లుల విడుదలలో జాప్యం జరుగుతోందని, దీంతో చిన్న ఆసుపత్రులు మూతపడే పరిస్థితి నెలకొందని హరీష్ రావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 607 మందికి డబ్బులు విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినా కేవలం 496 మందికే ఇచ్చారని వివరించారు.

March 26, 2026 / 01:36 PM IST