NRML: నిర్మల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల రామాలయం సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముస్తాబు అవుతోంది. ఈనెల 27న శుక్రవారం ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.
NZB: శ్రీహరికోట సందర్శనకు మోస్రా జిల్లా పరిషత్ హై స్కూల్ 9వ తరగతి చదువుతున్న శివ సాయి ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం సాయిలు తెలిపారు. ఇది వరకు అగస్త్యా ఫౌండేషన్, ఐఎస్ఆర్డీ వారు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో శివ సాయి పాల్గొనగా, అందులో అర్హత సాధించి శ్రీహరికోట సందర్శనకు ఆహ్వానం అందినట్లు చెప్పారు.
GDWL: జన గణన-2027 ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల IDOCలో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కచ్చితమైన వివరాలను సేకరించాలని, ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనంలో నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీ.ఎడ్ పరీక్ష ఫలితాలను ఉపకులపతి ప్రొఫెసర్ శ్రీనివాస్ ఇవాళ విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాల కోసం యూనివర్సిటీ వెబ్ సైట్లో సందర్శించాలన్నారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ కే.ప్రవీణ, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
SRD: ఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రమేష్‌పై BJP నేత సాయిరాం మంగళవారం సబ్ కలెక్టర్ ఉమా హారతికి ఫిర్యాదు చేశారు. స్థానికంగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రశ్నిస్తే, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రమేష్ కలుగజేసుకొని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. అని బెదిరించాడన్నారు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.
MDK: ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ ఆదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని టెక్మాల్ ఎస్సై అరవింద్ కుమార్ సూచించారు. అల్లాదుర్గం కోర్టులో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ కాదగిన కేసులను కక్షిదారులు, అర్జీదారులు ఇరువురు రాజీ అయితే తొలగించుకోవచ్చన్నారు. దీంతో పాటు డ్రంకెన్ డ్రైవ్ కేసులు, ఈ-పెట్టి కేసులు తక్కువ జరిమానాతో తొలగించుకోవచ్చని పేర్కొన్నారు.
KNR: ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి గ్యాస్ సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. సీతారాంపూర్‌లోని నిర్మల భారత్ గ్యాస్ ఏజెన్సీ గోదాములో మంగళవారం ఆకస్మిక చేశారు. గృహ వినియోగదారుల, వాణిజ్య పరమైన సిలిండర్ల బుకింగ్, స్టాక్ నిల్వలు, రోజు వారీ సరఫరా, తదితర వివరాలు ఆరా తీశారు.
ADB: ఎంఐఎం పార్టీ సీనియర్ నేత, మైనార్టీల నాయకుడు సిరాజ్ ఖాద్రి మరణం సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలురి గోవర్ధన్ రెడ్డి మంగళవారం ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మరణం MIM పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.
NGKL: అచ్చంపేట మున్సిపాలిటీ పశువుల సంత వేలం ముగిసింది. వేలంలో జగ్జీవన్ రావ్ అనే వ్యక్తి అత్యధికంగా రూ.39,01,000 పాడి టెండర్ దక్కించుకున్నారు. ప్రతి శనివారం జరిగే ఈ సంతలో మున్సిపల్ నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని ఛైర్మన్ శ్రీనివాసులు సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, కౌన్సిలర్లు, స్థానికులు పాల్గొన్నారు.
BHPL: ఈనెల 28వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగపరచుకోవాలని కాలేశ్వరం ఎస్సై జీ. తమాషారెడ్డి సూచించారు. రాజీమార్గమే- రాజామార్గం అని, రాజీతో సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. కేసులు రాజీ కావాలనుకునేవారు పోలీస్ అధికారులను సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే పరిష్కారం జరుగుతుందన్నారు.
KMR: బీర్కూర్ మండలంలోని 13 రేషన్ షాపుల పరిధిలో ఏప్రిల్ 1 నుంచి 3 నెలల (ఏప్రిల్, మే, జూన్) రేషన్ పంపిణీ చేయనున్నట్లు బీర్కూర్ తహసీల్దార్ సవాయిసింగ్ తెలిపారు. అలాగే అంత్యోదయ లబ్ధిదారులకు రేషన్ కార్డుకు ఒక కిలో చొప్పున చక్కెర పంపిణీ చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని రేషన్ లబ్ధిదారులు వినియోగించుకోవాలని సూచించారు.
BDK: మణుగూరు మండలం వ్యవసాయ విస్తరణ అధికారి కొమురం లక్ష్మణరావుకు ఇటీవల డాక్టరేట్ ప్రధాన ఉత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ రైతు వేదికలో సర్పంచ్‌లు కారం పూజ, ప్రసాద్, ఉప సర్పంచ్లు, గాండ్ల సురేష్, మహేష్‌తో కలిసి లక్ష్మణరావును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ASF: జైనూర్ మండలంలోని జెండాగూడ చెందిన సవితకు మంగళవారం పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. ఈ మేరకు ఆమెను ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈఎంటీ (EMT) దత్తాత్రేయ తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లి, బిడ్డలను 108 వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పైలట్ బాపూరావు సిబ్బందికి అభినందనలు తెలిపారు.
NRML: రామ్‌రావుబాగ్‌లో శ్రీ ఆంజనేయ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం మంగళవారం ఎన్నికైంది. వార్డు కౌన్సిలర్ రామోజీ నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా అమృత్ అశోక్ పటేల్, ఉపాధ్యక్షులుగా ఆడేలు, రామ్ నరేష్, కార్యదర్శులుగా జనార్ధన్, విజయ్, కోశాధికారులుగా చేనీ దానయ్య, బార్ల సుభాష్ ఎంపికయ్యారు. వీరిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
GDWL: ఎన్నికల హామీలు అమలు, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనే నినాదంతో బీఆర్ఎస్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో గద్వాల నుంచి బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య, విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం హైదరాబాద్ వెళ్లారు. అసెంబ్లీ ముట్టడికి యత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేసి అసిఫ్ నగర్ స్టేషన్‌కు తరలించారు.