NLG: కనగల్లో 6 కోట్లతో నిర్మించనున్న జూ.కళాశాల భవన నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.