SRD: నాగల్ గిద్ద మండలం కరస్ గుత్తి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్‌కు నిర్వాహకులు ఆహ్వానించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఆయనను కలిసి ఈనెల 25న శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పకుండా వస్తానని మాజీ ఎంపీ చెప్పారని నిర్వాహకులు లక్ష్మణ్ తెలిపారు.