BPT: యుద్ధ ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడిందని అద్దంకి వ్యాపారులు తెలిపారు. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో గత 10 రోజులుగా అనేక హోటళ్లు మూతపడ్డాయి. అద్దె భారం తగ్గించేందుకు కొందరు నిర్వాహకులు కట్టెల పొయ్యులతో వంట కొనసాగిస్తున్నారు. సమస్యపై ప్రభుత్వం స్పందించి తక్షణం సిలిండర్ల సరఫరా పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.