ATP: జుంజురాంపల్లిలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. అన్నదాతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.