MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో గిరిజనులు, మీటర్ లేని విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ స్తంభాలు, మీటర్లు అందించనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అర్హులైన వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఎస్టీ సర్టిఫికెట్ పత్రాలను సంబంధిత విద్యుత్ అధికారులకు సమర్పించాలని సూచించారు. గిరిజనులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.