AP: సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భేటీ అయ్యాడు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సంజయ్ దత్ బృందం నేరుగా వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లి సీఎంను కలిసింది. గత ఫిబ్రవరిలో ముంబై వేదికగా మంత్రి లోకేష్‌తో చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ పర్యటన సాగుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయి ఫిలిం సిటీ నిర్మాణంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.