BHNG: దళితులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 30న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు ఇవాళ సదరు కరపత్రాన్ని అమ్మనబోలులో మాదిగ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసగల్ల రమేష్ విడుదల చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ పిలుపు మేరకు జరిగే ఈ దీక్షకు మాదిగలు తరలిరావాలని కోరారు.