W.G: నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో పెనుగొండ(మం) నడిపూడి గ్రామ సర్పంచ్ కడలి బేబీ అన్నపూర్ణ సంతకం అధికారాన్ని (చెక్ పవర్) రద్దు చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధుల వినియోగంపై వార్డు సభ్యులు, గ్రామస్థులు చేసిన ఫిర్యాదుపై విచారణ అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి వెల్లడించారు.