MBNR: న్యూ ఢిల్లీలోని షా ఆడిటోరియంలో నిర్వహించిన అఖిల భారతీయ కల్వార్ కలాల్ కళార్ మహాసభ జాతీయ సదస్సులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సమాజ ఐక్యత, రాజకీయ ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కల్వార్ కలాల్ కళార్ వర్గాల అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాల విస్తరణపై సదస్సులో కీలక చర్చలు జరిగాయని తెలిపారు.