AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సమస్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. నాగావళి, వంశధార ముఖద్వారాల తీరకోత సమస్యను వివరించారు. ఈ సమస్యను అరికట్టాలని, తక్షణం నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. జాతీయ విపత్తు నివారణ నిధి నుంచి నిధులు ఇవ్వాలని రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు.