GDWL: అలంపూర్ జోగులాంబ క్షేత్రంలోని వాసవి నిత్యాన్నదాన సత్రంలో ఏపీ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్మయ్యను సత్రం కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇటీవల ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. గద్వాల జిల్లా అధ్యక్షుడు బాలస్వామి, ఆలూరు రాము తదితరులు పాల్గొని లక్ష్మయ్యను శాలువాతో సత్కరించారు.