MBNR: జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అడిషనల్ కలెక్టర్ హరిప్రియ సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision) ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. అనంతరం డిగ్రీ కళాశాలలో నిర్వహించిన బీఎల్ఓ (BLO) సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని కీలక సూచనలు అందించారు.