SKLM: ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల, ప్రజల సమస్యలపై సమీక్ష నిర్వహించారు.