SRPT: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం నూతనకల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీఎస్ పరిసరాలు, రికార్డులను, ఫిర్యాదుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తులో వేగవంతం చేసి, రికార్డులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే వారికి భరోసా కల్పించాలన్నారు.