MBNR: రైతు భరోసా కొత్త దరఖాస్తులు, బ్యాంక్ వివరాల అప్డేట్ కోసం ఈ నెల 25 వరకు గడువు ఉందని కౌకుంట్ల మండలం ముచ్చింతల ఏఈవో గాయత్రీ తెలిపారు. అర్హులైన రైతులు ఆధార్, కొత్త పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గడువు ముగిశాక దరఖాస్తులు తీసుకోబడవని ఆమె స్పష్టం చేశారు.