విశాఖ పర్యటనలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ముగ్గురు ట్రాన్స్జెండర్లకు CNG ఆటోలు పంపిణీ చేసి, ముగ్గురు దివ్యాంగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణు కుమార్ రాజు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత పాల్గొన్నారు.