ఢిల్లీ ప్రజలకు CM రేఖా గుప్తా గుడ్న్యూస్ చెప్పారు. అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.1,03,700 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్ ప్రసంగించిన సీఎం, సామాన్యులపై వరాల జల్లు కురిపించారు. హోలీ, దీపావళి పండగల సందర్భంగా ప్రతి ఇంటికి ఒక ఉచిత LPG సిలిండర్ను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకానికి రూ.260 కోట్లు కేటాయించారు.