SRPT: మట్టపల్లిలో మంగళవారం నిర్వహించిన గ్రామసభలో మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలపై గ్రామస్తులు అధికారుల దృష్టికి తెచ్చారు. సర్పంచ్ విజయశాంతి అప్పరావు మాట్లాడుతూ.. గ్రామ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.