GDWL: ప్రయాణికుల భద్రత కోసం డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని AMVI పవన్ కుమార్ సూచించారు. గద్వాల బస్ డిపోలో జరిగిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ.. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సెల్ఫోన్ వినియోగం ప్రాణాంతకమని హెచ్చరించారు. బాధ్యతగా వ్యవహరించి ప్రమాదాలను నివారించాలని కోరారు.