AP: రాజధాని ప్రాంతం రాయపూడిలో అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్లాస్టిక్ పైపులు దగ్ధమైన ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకి అధికారులు వివరించారు. రాజధాని ప్రాంతంలో తరచూ అగ్నిప్రమాదాలు జరగడంపై సీఎం అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదమా? కుట్రకోణమా? అనే విషయంలో లోతుగా విచారణ జరపాలని అధికారులకు ఆదేశించారు.