AP: అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ ఉత్తరాంధ్రకు దిక్సూచి అవుతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఉత్తరాంధ్ర ఇకపై ‘ఉక్కు ఆంధ్రా’గా మారుతుందని పేర్కొన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉక్కు రంగంలో ఏపీ దేశంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని తెలిపారు. కబ్జాలు, కూల్చివేతలు, భయంతో అల్లాడిన ఉత్తరాంధ్రలో నేడు ఆనందాన్ని, భరోసాను తీసుకొచ్చామన్నారు.