కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై సమీక్ష నిర్వహించారు. అంతర్రాష్ట్ర ముఠాల కదలికలపై నిఘా ఉంచి, శాస్త్రీయ సాక్ష్యాధారాలతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణకు ‘ఆపరేషన్ కవచ్’ బలోపేతం చేయాలని, రాత్రి గస్తీలు ముమ్మరం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ASP చైతన్య రెడ్డి ఉన్నారు.