MBNR: జిల్లా ప్రజల న్యాయ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డి. జానకి పిలుపునిచ్చారు. ట్రాఫిక్ చలాన్లు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలను రాజీ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అలాగే కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గించుకోవాలని ఆమె సూచించారు.