NLG: రైతు భరోసాకు రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని తొరగల్ క్లస్టర్ AEO మురళీధర్ తెలిపారు. 28/02/2026 లోపు కొత్త పట్టాదారు పాసుపుస్తకం పొందినవారు, గతంలో వచ్చి ఇప్పటివరకు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోని వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతులను జత చేసి కార్యాలయం వద్ద అందజేయాలని సూచించారు.