TG: పశ్చిమాసియా యుద్ధంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడుతుందని అన్నారు. ప్రధాని మోదీ యాక్షన్ ప్లాన్ ఏంటో తెలియాలని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ఆపినట్టు.. ఇరాన్ యుద్ధాన్ని ఆపి చమురు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సోలార్ ఎనర్జీ ద్వారా దేశాన్ని కాపాడాలని ప్రతిరోజు సూర్య భగవానుడిని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు.