AP: నియోజకవర్గాల పునర్విభజనతో అవకాశాలు మరింత పెరుగుతాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన ఆయన.. నియోజకవర్గాల్లో సమస్యలపై ఆరా తీశారు. సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలపై చర్చించారు. కమిటీల ఏర్పాటు విషయంలో పిఠాపురం మోడల్ని మిగతా నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని సూచించారు. కూటమి పార్టీల సయోధ్య విషయంలో దిశానిర్దేశం చేశారు.