AP: విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలను తగ్గించే అంశంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ‘ప్రజలపై విద్యుత్ భారం తగ్గేలా సంస్కరణలు చేపట్టాలి. విద్యుత్ కొనుగోలు ధర యూనిట్ రూ.4కు తగ్గాలి. పీఎం సూర్య ఘర్ పథకం మరింత చేరువవ్వాలి. విద్యుత్ సంస్థల సమర్థ నిర్వహణతో రూ.339 కోట్లు ఆదా చేశాం’ అని వెల్లడించారు.