PPM: కురుపాం సర్కిల్ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన సుమారు 148 లీటర్ల నాటుసారా, 6 లీటర్ల మద్యాన్ని మంగళవారం పోలీసులు ధ్వంసం చేశారు. విజయనగరం డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వుల మేరకు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ ఏ. సంతోష్ సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.