TG: ప్రజల దృష్టి మరల్చేందుకే ఫార్ములా ఈ-రేస్ ఛార్జ్‌షీట్ వేశారని మాజీ మంత్రి KTR ఆరోపించారు. ఈ-రేస్ కేసులో ఏమీ లేదని ప్రభుత్వం మళ్లీ ఒప్పుకుందన్నారు. తాము కట్టింది రూ.45 కోట్లయితే.. రూ.500 కోట్ల అని చెబుతున్నారని మండిపడ్డారు. ఎవరికి అనుచిత లబ్ధి చేకూర్చామని ఆరోపిస్తున్నారో.. వారి పేరే లేదని అన్నారు. విధానపరమైన లోపం ఉన్నట్లుందని ఛార్జ్‌షీట్ ద్వారా తెలుస్తోందన్నారు.