AKP: ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న రూ. 30 వేల కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. మంగళవారం పాయకరావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామన్నారు.