‘కాంతార’లోని దైవిక సన్నివేశాన్ని కించపరిచేలా రణ్వీర్ ప్రవర్తించాడని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రణ్వీర్ బేషరతుగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధమయ్యాడు. ఆయన స్వయంగా మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి క్షమాపణలు చెబుతారని రణ్వీర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ వివాదం ముగిసిపోయే అవకాశం ఉంది.