NGKL: ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించి రికార్డు సృష్టించింది. హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారుల చేతుల మీదుగా జిల్లాకు ప్రత్యేక అవార్డులు అందజేశారు. టీబీ నిర్మూలనలో విశేష సేవలు అందించిన డా. రవికుమార్ నాయక్, ప్రోగ్రామ్ అధికారి రఫీక్ సత్కారం పొందారు.