SRCL: ఈనెల 27న వేములవాడ రాజన్న క్షేత్రంలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశించారు. మంగళవారం ఆయన ఆలయ పరిసరాలు, శివర్చన, పార్కింగ్ ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.